నారాయణ స్కూల్ విద్యార్థిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ ఇచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరు సభలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సభా వేదికపై నారాయణ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థిని దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రతిరోజూ కందుకూరులో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతుంటుంది. కానీ, ఈరోజు సీఎం వస్తున్నారని చెత్తను శుభ్రం చేశారు. రోజూ అలా క్లీన్‌గా ఉంచుకోవాలి. అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్నారి స్పీచ్‌తో సభా వేదికపై ఉన్నవారంతా షాక్ అయ్యారు.
విద్యార్థిని దీప్తి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరును సీఎం చంద్రబాబు చిన్నారి బయటపెట్టడంతో అంతా షాక్‌కు గురయ్యారు.