రాజకీయాల్లో ఒక నాయకుడి స్థాయిని నిర్ణయించేది అతను మాట్లాడే మాట, అతనికి సబ్జెక్టుపై ఉండే పట్టు, విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించే సంయమనం. కానీ, ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Assembly Budget Sessions) గమనిస్తుంటే.. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ మూడు విషయాల్లోనూ ఘోరంగా విఫలమవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. శాసనసభ (Legislative Assembly) వేదికగా ఆయన ప్రదర్శిస్తున్న తీరు ‘చినబాబు’ (Chinababu) రాజకీయ పరిపక్వతను ప్రశ్నార్థకం చేస్తోంది.
విషయ పరిజ్ఞానం సున్నేనా..?
బడ్జెట్ సమావేశాలు అంటే గణాంకాలు, విధానపరమైన నిర్ణయాలు, రాష్ట్ర భవిష్యత్తుపై (State Future)చర్చ జరగాలి. కానీ, లోకేష్ తీరు చూస్తుంటే సబ్జెక్ట్ (Subject) కంటే ఎక్కువగా వ్యక్తిగత దూషణలు (Personal Allegations), ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు లోకేష్ తన స్పీచ్‌తో తనదైన ముద్ర వేస్తారని, అందరి దృష్టిని ఆకట్టుకుంటారని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. అసలు విషయంపై అవగాహన లేకపోవడమో, లేక సమాధానం చెప్పాలనే తాపత్రయం లేకనో గానీ.. ఆయన ప్రసంగాలు అత్యంత పేలవంగా సాగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సహనం కోల్పోతున్న ‘యువగళం’
ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఓర్పు. అయితే సభలో ప్రత్యర్థి పక్షం నుండి చిన్నపాటి విమర్శ వచ్చినా లోకేష్ వెంటనే ‘ట్రిగర్’ (Trigger) అయిపోతున్నారు. గౌరవప్రదమైన సభలో అదుపు తప్పిన మాటలు, అసభ్యకర పదజాలం వాడటం ఆయన సంస్కారాన్నే ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ చర్చలో ఇరుక్కుపోయిన ప్రతిసారీ తల్లులను, కుటుంబ సభ్యులను మధ్యలోకి తెచ్చి సెంటిమెంట్ పండించాలని చూడటం ఆయన బలహీనతకు నిదర్శనం అంటున్నారు. వైసీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు, చర్చను పక్కదారి పట్టించి ఎదురుదాడికి దిగడం లోకేష్‌కు అలవాటుగా మారిందన్న చర్చ జరుగుతోంది.
సభా మర్యాదలు గాలికి..
సభలో సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం, బెదిరింపు ధోరణితో మాట్లాడటం, శాపనార్థాలు పెట్టడం వంటివి ఒక మంత్రి స్థాయికి తగవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “ఏం పీకారు?” అంటూ ఆయన వాడే భాష.. వీధి రాజకీయాలను తలపిస్తోందే తప్ప, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిలా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లోకేష్ ఇంకా తనను తాను నిరూపించుకోవాలనే ఆత్రుతలో తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహం తప్ప, సబ్జెక్ట్ పై పట్టు సాధించడంలో ఆయన వెనుకబడ్డారు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ వేదికగా లోకేష్ తీరును గమనించిన సామాన్య ప్రజలు కూడా ఆయన నాయకత్వ పటిమపై పెదవి విరుస్తున్నారు. కేవలం వారసత్వంతో నాయకులు అయిపోవచ్చు కానీ, ప్రజల మనసు గెలవాలంటే జ్ఞానం, సంయమనం రెండూ ఉండాలి. మరి ఇప్పటికైనా ‘చినబాబు’ తన శైలిని మార్చుకుంటారా? అనేది వేచి చూడాలి.








