కర్ణాటకలోని శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి నారా లోకేష్, సమాజంలో నైతిక విలువల పతనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళలను గౌరవించడం, విద్యార్థుల ప్రవర్తనపై ఆయన కొన్ని సూచనలు చేశారు.
లోకేష్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
“గాజులు తొడుక్కున్నావా?”, “అమ్మాయిలా ఏడవద్దు” వంటి పదప్రయోగాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వాడుక భాషలో ఇలాంటి పదాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యాశాఖ సలహాదారుగా నియమించుకున్నామని, ఆయన చెప్పినట్లు “తల్లికి చెప్పలేని ఏ పనినీ చేయకూడదు” అనే సూత్రాన్ని విద్యార్థులు పాటించాలని కోరారు. జీవితంలో ఓటమి సహజమని, దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలని హితవు పలికారు.
“సొంత రాష్ట్రంలో బల్లులు.. పక్క రాష్ట్రంలో నీతులు”
లోకేష్ వ్యాఖ్యలపై ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు, నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నాయి. లోకేష్ తీరును ‘హాస్యాస్పదం’ అని కొట్టిపారేస్తున్నాయి. అసెంబ్లీ, ఇతర వేదికలపై “ఏం పీకారు”, “అరేయ్ భయ్” అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడిన లోకేష్, ఇప్పుడు భాషా సంస్కరణల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సెటైర్లు పేలుస్తున్నారు.
శాసనమండలిలో మంత్రి లోకేష్ పరుష పదజాలం
— Telugu Feed (@Telugufeedsite) September 23, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ పై మండలిలో చర్చలో..
గత ఐదేళ్లలో ''ఏం పీకారు.. మీరు పీకిందేంటీ.. మీరు పీకిందేంటీ'' అంటూ సభలో రెచ్చిపోయిన మంత్రి లోకేష్
రూ.14,000 కోట్లు ఇచ్చిన వాళ్లని మీరు ప్రశ్నిస్తారా ?..మీరు గత ఐదేళ్లలో ఏం పీకారు ? pic.twitter.com/C8kn51NIVw
ఏపీలో పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మధ్యాహ్న భోజనంలో బల్లులు రావడం, నాణ్యత లేని యూనిఫాంలు, చిరిగిన స్కూల్ బ్యాగులు లోకేష్ శాఖలోని లోపాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు కనీస రక్షణ కల్పించలేని మంత్రి, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి విలువలను బోధించడం ‘సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.








