‘దసరా’ (Dasara) బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న ‘ది పారడైజ్’ (The Paradise) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 21న చిన్ననాటి సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభం కాగా, ఇప్పుడు నాని షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం హైదరాబాద్( Hyderabad)లోని ఆర్ఎఫ్‌సీ (RFC)లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో రియల్ సతీష్ మాస్టర్ (Satish Master) నేతృత్వంలో ఒక హై-ఇంటెన్సిటీ మాస్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. విదేశీ స్టంట్ మాస్టర్స్ సహాయంతో రూపొందిస్తున్న ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్ర బృందం తెలిపింది.
‘ది పారడైజ్’ పాన్ వరల్డ్ స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తోనే భారీ అంచనాలను సృష్టించింది. నానిని పవర్‌ఫుల్ మాస్ అవతారంలో చూపించనున్న ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.