నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మాతగా, నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’(Alias Rukmini) సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు (Regular Shooting) సిద్ధమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆగస్టు 3న హైదరాబాద్‌లో(Hyderabad) సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కథలో ఎక్కువ భాగం ఇండోర్ సన్నివేశాలే ఉండటంతో నగరంలోని ప్రముఖ స్టూడియోల్లో ప్రత్యేక సెట్స్ నిర్మించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ (Muralikanth Devsot) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్నారు. నితిన్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె పాత్రపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బోల్డ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్(Vijay Bulganin) సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కీలకమైన పాటలు, కొన్ని అవుట్‌డోర్ సన్నివేశాలను ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కథపై నమ్మకంతోనే నాని ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాని–నితిన్ కాంబినేషన్ కావడంతో ‘అలియాస్ రుక్మిణి’పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. షూటింగ్ ప్రారంభంతో సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ వరుసగా వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2027 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.








