---Advertisement---

జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. – స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు

జైల్లో ఎలా ఉంచాలో సీఎం కొడుకు చెబుతున్నాడు.. - స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు
---Advertisement---

గుంటూరులోని జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కు వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంత‌రం జైలు బ‌య‌ట స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడారు. నందిగాం సురేష్‌పై కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధిస్తోంద‌ని, అక్ర‌మ కేసులు పెట్టి నాలుగు నెల‌లుగా జైలులో పెట్టి వేధిస్తున్నార‌న్నారు. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి, అన్యాయంగా సురేష్‌ను జైలులో ఉంచుతున్నారు అని సజ్జల అన్నారు.

మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కి జైల్లో కనీస సదుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని, వాటర్ బాటిల్‌ను కూడా అనుమతించడం లేద‌న్నారు. సురేష్‌ను జైల్లో ఎలా ఉంచాలో ముఖ్యమంత్రి కొడుకే ఫోన్ చేసి డైరెక్ష‌న్స్ ఇస్తున్నార‌ని ఆరోపించారు.

వైసీపీపై వ్యక్తిగత దాడులు
కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తోంద‌ని స‌జ్జ‌ల మండిప‌డ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నార‌ని, 30 సంవత్సరాల క్రితం నక్సలైట్లను అరెస్టు చేసిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నార‌ని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన అధికారం ప్రజల కోసమే ఉప‌యోగించాల‌ని, అలా కాకుండా కూటమి ప్రభుత్వం కొత్త కొత్త పద్ధతులు కక్ష తీర్చుకోవడంలో ప్రయోగిస్తోందన్నారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఎలా వేధించాలో కూట‌మి నేత‌లు త‌మ‌కు నేర్పిస్తున్నార‌ని స‌జ్జ‌ల అన్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ కార్య‌క‌ర్త‌లు చెప్పిన వినే ప‌రిస్థితితో ఉండ‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment