హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టు (Nampally Court) వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టుకు బాంబు బెదిరింపు (Bomb Threat) రావడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది, కేసుల కోసం వచ్చిన ప్రజలను భద్రతా కారణాల దృష్ట్యా బయటకు తరలించారు.
భారీ భద్రత, క్షుణ్ణంగా తనిఖీలు
నాంపల్లి కోర్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) సహాయంతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బెదిరింపు కాల్ లేదా మెసేజ్ వెనుక ఎవరు ఉన్నారు? దానికి కారణం ఏమిటి? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే కోర్టు కార్యకలాపాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతోంది.








