అఖిల్ పెళ్లి.. సీఎంకు నాగ్ దంప‌తుల ఆహ్వానం

అఖిల్ పెళ్లి.. సీఎంకు నాగ్ దంప‌తుల ఆహ్వానం

అక్కినేని ఇంట పెళ్లి సంద‌డి మొద‌లైంది. నాగార్జున చిన్న కుమారుడు త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈ మేర‌కు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) ఆయన భార్య అమ‌ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున దంపతులు, తమ కుమారుడు అఖిల్ (Akhil) వివాహ పత్రికలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.అఖిల్ (Akhil) మరియు జైనబ్ (Zainab) వివాహం జూన్ 6న జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య (Naga Chaitanya) వివాహం జరిగినట్టు అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) వేదికగా జర‌గ‌నుంద‌ని స‌మాచారం. గత కొన్ని సంవత్సరాలుగా అఖిల్ మరియు జైనబ్ ప్రేమలో ఉన్నారు. రెండు కుటుంబాల అనుమతితో గత సంవత్సరం నవంబర్ 26న వారి నిశ్చితార్థం (engagement) అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఈ జంట పలుమార్లు నగరంలో కలసి సందడి చేశారు. ప్ర‌స్తుతం ఈ జంట పెళ్లికి రెడీ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment