---Advertisement---

మయన్మార్‌ భూకంపం.. 3 వేలు దాటిన మృతుల సంఖ్య

మయన్మార్‌ భూకంపం.. 3,085 దాటిన మృతుల సంఖ్య
---Advertisement---

మయన్మార్‌ (Myanmar)లో సంభవించిన భూకంపం (Earthquake) ఆ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు నిరంతరం కృషి చేస్తుండగా, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజుకు రోజుకు ఆ సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు 3,085 మంది మరణించగా, 4,715 మంది గాయపడ్డారు. మిలిటరీ ప్రభుత్వం (Military Government) ప్రకారం, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అదనంగా, 341 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, నిరుపేదలకు అత్యవసర సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment