మయన్మార్ (Myanmar) ను భారీ భూకంపం కుదిపేసింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెన్ ఫీనిక్స్ (Jen Phoenix) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం 334 అణుబాంబుల (334-Nuclear Bombs) విధ్వంసానికి సమానమని అంచనా. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఏర్పడిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
మయన్మార్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా, ఈ భూకంప ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు సూచించారు.