మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని మంత్రి నారాయణ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రూ. కోటి 95 ల‌క్ష‌ల‌ వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఈ బంకుల్లో ప్రత్యేకంగా మహిళలకే ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టినట్లు నారాయణ వెల్లడించారు.

ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, 123 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు.

ఉపాధికి కొత్త అవకాశాలు
మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ప్రారంభం రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక స్వావలంబనకు మార్గం వేస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment