వాస్తవాలు vs ప్రచారాలు.. మూలపేట పోర్టు క్రెడిట్ ఎవరిది?

వాస్తవాలు vs కుతంత్రాలు.. మూలపేట పోర్టు క్రెడిట్ ఎవరిది?

ఉత్తరాంధ్ర (North Andhra) ముఖద్వారం, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను (Srikakulam District) పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ఆశాకిరణంగా నిలిచిన ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు’ (Moolapeta Greenfield Port) ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. దశాబ్దాల కలగా మిగిలిపోయిన ఈ ప్రాజెక్టును సాకారం చేసింది ఎవరు? దీని క్రెడిట్ దక్కించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అనే అంశాలపై ప్రత్యేక కథనం.

దశాబ్దాల మోసం.. జగన్ పాలనలో సాకారం
నిజానికి గతంలో ప్రతి ఎన్నికల సమయంలోనూ మూలపేట పోర్టు అంశాన్ని టీడీపీ(TDP) తన మేనిఫెస్టోలో (Manifesto) పెట్టి ప్ర‌జ‌ల నుంచి ఓట్లు దండుకుంది. అధికారంలోకి వ‌చ్చాక మూల‌పేట ప్ర‌స్తావ‌నే లేదు. ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ, 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, వెనుకబడిన శ్రీ‌కాకుళం ప్రాంత‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే రూ.4,361.91 కోట్ల భారీ వ్యయంతో సంతబొమ్మాళి మండలంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సంకల్పించారు.

శంకుస్థాపన – పనుల వేగం
ఏప్రిల్ 19, 2023న వైఎస్ జగన్ స్వయంగా ఈ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 4,362 కోట్లతో పోర్టు నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోని 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లు వెచ్చించారు. టెక్కలి జాతీయ రహదారి నుంచి పోర్టు వరకు రోడ్డు పనుల కోసం 327.75 ఎకరాలు, రైల్వే లైన్ కోసం 100.71 ఎకరాలను రైతుల(farmers) అంగీకారంతో సేకరించారు. వైసీపీ (YSRCP) హయాంలో కేవలం ఏడాది కాలంలోనే ఎన్నికల నాటికే 70 శాతం పనులు పూర్తి చేయడం ఒక రికార్డుగా నిలిచింది.

పనులు నిలిపివేత ఎందుకు?
వైసీపీ హయాంలో శరవేగంగా సాగిన పోర్టు పనులు(Port Works), ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెమ్మదించాయని ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయలేక రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పనులు నిలిపివేయడం వెనుక ‘కమీషన్ల’ లావాదేవీలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయినప్పటికీ, మళ్లీ భూములు కావాలంటూ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

మూలపేట పోర్టు అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక జీవనాధారం. ఈ ప్రాజెక్టును శంకుస్థాపన నుంచి 70 శాతం పూర్తి చేసే వరకు వైఎస్ జగన్ చూపిన చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, కేవలం రంగులు మార్చి క్రెడిట్ కొట్టేయాలని చూడటం భావ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘క్రెడిట్ వార్’
వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, దీనిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ సమరశంఖం పూరించింది. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అనే కార్య‌క్ర‌మాన్ని నేడు చేప‌ట్టింది. నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈ సభ ద్వారా పోర్టుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను ప్రజలకు వివరించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment