ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉంది

మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమారులు ముద్రగడ బాలు మరియు ముద్రగడ గిరిబాబు వెల్లడించారు.”

మా తండ్రి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు అసత్యం. అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది” అని వారు స్పష్టం చేశారు.

ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ముద్రగడ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది. “మా తండ్రి ఆరోగ్యం పట్ల ఆయన చూపిన శ్రద్ధకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది,” అని వారు అన్నారు.

ముద్రగడని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక, ఆయన ఆరోగ్య కోసం ప్రార్థనలు, పూజలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment