‘భగవద్గీత బ‌తుకులు మార్చ‌లేదు’ – వివాదంలో టీటీడీ బోర్డ్ మెంబ‌ర్‌

'భగవద్గీత బ‌తుకులు మార్చ‌లేదు' - వివాదంలో టీటీడీ బోర్డ్ మెంబ‌ర్‌

క‌లియుగ దైవం ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanam ) బోర్డు మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే భ‌గ‌వ‌ద్గీత‌ (Bhagavad Gita)పై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే మరియు టీటీడీ (TDP) బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు(M.S.Raju) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ (B.R.Ambedkar) విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్లి అంబేద్క‌ర్ సేవ‌ల స్మ‌రించుకోకుండా.. అసంద‌ర్భ వ్యాఖ్య‌ల‌తో హిందూధ‌ర్మ ప‌రిర‌క్షకుల‌కు అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా టీటీడీ బోర్డు మెంబ‌ర్ భ‌గ‌వ‌ద్గీత ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా చేసిన వ్యాఖ్య‌లు విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ప్ర‌తినిధుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి.

“భగవద్గీత వల్ల ప్రజల బతుకులు మారలేద‌న్న వ్యాఖ్య”పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ధార్మిక భావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ నాయకులు ఎంఎస్ రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదు,” అని వీహెచ్‌పీ నేతలు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్, వీహెచ్‌పీ నేత సత్యరవి మాట్లాడుతూ, ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి, టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాల‌ని, టీటీడీ దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

“ఎంఎస్ రాజు పై చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం. ఉధృతంగా పోరాటాలు కొన‌సాగిస్తాం” అని స్పష్టం చేశారు. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమని హిందూ సంఘాలు పేర్కొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment