ఏపీ లిక్కర్ (AP Liquor) కేసు(Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ(YSRCP) లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (PeddiReddy Mithun Reddy)కి బెయిల్(Bail) లభించింది. విజయవాడ (Vijayawada)లోని ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం వైసీపీ శ్రేణులకు ఊరటగా మారింది.
బెయిల్ మంజూరు సమయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది. రూ. 2 లక్షల పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా వారంలో రెండుసార్లు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని కూడా షరతు విధించింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జులై 20న పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బెయిల్ మంజూరు కావడంతో రేపు జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో తాజా పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.








