చిత్తూరు జిల్లా మంగళంపేట భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ఆరోపణలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. మంగళంపేట అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆక్రమించారని ఆరోపిస్తూ తాను హెలికాప్టర్‌లో సెల్‌ఫోన్‌లో షూట్ చేస్తున్న వీడియోతో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
పవన్ ట్వీట్‌కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరిన మిథున్ రెడ్డి (Mithun Reddy), నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబం చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిందని, అన్ని రికార్డులు పబ్లిక్‌గా ఉన్నాయని, కావాలంటే పబ్లిక్ డొమైన్‌లో చెక్ చేసుకోవాలని మిథున్ స్పష్టం చేశారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని సూచించారు. గతంలో కూడా ఎర్రచందనం (Red Sandalwood) విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని గుర్తుచేసిన మిథున్ రెడ్డి.. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

2000లో చట్టబద్ధంగా కొనుగోలు!
మంగళంపేటలో 2000 సంవత్సరంలో పెద్దిరెడ్డి చట్టబద్దంగా భూములు కొనుగోలు చేశారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్‌మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2000లో వాటిని పెద్దిరెడ్డి చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టారు. కేంద్ర అటవీశాఖ నుంచి 2022 జూన్ 27న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చింది.
గతంలో ఈ భూములపై ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి అది అటవీ భూమి కాదని.. పూర్తిగా ప్రైవేట్ భూమేనని నిర్ధారించారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై మరోసారి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రైవేటు భూమి అని మరోసారి నిర్ధారించారు.









అరేయ్.. ఇటు రారా.. లం***కా.. – పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు