హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రాంతంలో యువతిపై (Young Woman) జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సినిమా షూటింగ్‌లో (Cinema Shooting) అవకాశం ఇప్పిస్తామని నమ్మించి ఇద్దరు యువకులు యువతిని సికింద్రాబాద్‌లోని (Secunderabad) ఓ గదికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు లైంగికదాడికి (Sexual Assault) పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మరో యువతితో కలిసి చిన్న చిన్న సినిమా షూటింగ్‌లు, ఈవెంట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా.. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు మోసపూరితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం ఈ నెల 16న ర్యాపిడో బుక్ (Rapido Book) చేసి యువతిని తిరిగి పంపించినట్లు సమాచారం.
ఇంటికి వచ్చిన యువతి ఒంటిపై గాయాలు గమనించిన ఆమె స్నేహితురాలు వెంటనే గాంధీ ఆస్పత్రికి (Gandhi Hospital) తీసుకెళ్లి చికిత్స చేయించింది. వైద్యుల ప్రశ్నలకు సమాధానంగా తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని బాధితురాలు వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సినిమా అవకాశాల పేరుతో యువతులను మోసం చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.








