మొంథా (Montha) తుఫాన్ (Cyclone ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వణికిస్తోంది. తుఫాన్ ఇవాళ రాత్రి 11 గంటలకు ఓడలరేవు-అంతర్వేది (Odalaravu–Antharvedi) మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది. అయితే తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమవుతున్నారు. మొంథా సహాయక చర్యల్లో గత వైసీపీ ప్రభుత్వం(YSRCP Government) తెచ్చిన వ్యవస్థలు మళ్లీ జగన్(Jagan) పరిపాలనను గుర్తిచేశాయి.
తుఫాన్ వేళ గ్రామ సచివాలయాలు (Village Secretariats) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతీ 2 వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం, సహాయక చర్యల్లో ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పని చేస్తుందో మరోసారి నిరూపితమైంది. తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు చేరువగా ఉండి, సమయానికి హెచ్చరికలు అందిస్తూ సచివాలయ సిబ్బంది సేవలందిస్తున్నారు. 1.3 లక్షల మంది సిబ్బంది నియామకం ద్వారా గ్రామీణ పరిపాలనను బలపరిచిన జగన్ ప్రభుత్వం, ప్రతి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా సచివాలయాల్లో సదుపాయాలు కల్పించింది.
ప్రస్తుతం మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ బ్రాడ్‌కాస్టింగ్ టెక్నాలజీతో సచివాలయాల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. విద్యుత్ లేకపోయినా పనిచేసే 360 హార్న్ స్పీకర్ వ్యవస్థ ద్వారా గ్రామాల అంతటా హెచ్చరికలు ప్రసారం చేస్తున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటివరకు 26 తీరప్రాంత గ్రామాల్లో అధికారులు తుఫాన్ అలర్ట్‌లు అందజేశారు.

“నాడు-నేడు” స్కూల్స్ – ఇప్పుడు పునరావాస కేంద్రాలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం “నాడు నేడు” పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో ప్రజలు భద్రంగా తలదాచుకుంటున్నారు. తుఫాన్ కారణంగా ఇళ్లను విడిచి వచ్చిన కుటుంబాలు ఈ పాఠశాలల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన గ్రామ సచివాలయ వ్యవస్థ, నాడు-నేడు స్కూల్స్ ఈ విపత్తు సమయంలో కూడా ప్రజల రక్షణకు అండగా నిలుస్తున్నాయని వైసీపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

వేలాది ప్రాణాలు కాపాడిన రిటర్నింగ్ వాల్
గతేడాది కురిసిన వర్షాలకు బుడమేరు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. విజయవాడ అంతా మునిగిపోయింది. ఆ సమయంలోనూ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అద్భుతమైన సేవలు అందించిందనేది కాదనలేని సత్యం. మోకాళ్లోతు నీళ్లలో దిగి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు వాలంటీర్లు. అంతటి వరదల్లో విజయవాడలోని కృష్ణలంక ప్రాంత వాసులు ధైర్యంగా ఉన్నారంటే.. జగన్ హయాంలో నిర్మించిన రివర్ రిటర్నింగ్ వాల్ కారణం. ఆ రక్షణ గోడ నిర్మించి ఉండకపోతే కృష్ణలంక ప్రాంతమంతా నీటిలో ముగిపోయేదని ఆ ప్రాంత వాసులు జగన్‌ను నడిరోడ్డుపై ఆపేసి కృతజ్ఞతలు తెలిపిన విషయం కూడా తెలిసిందే.









