తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు

తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు

మొంథా (Montha) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తీవ్రంగా కనిపిస్తోంది. మొంథా తుఫాన్ ఒక‌ మహిళ ప్రాణాల‌ను బ‌ల‌గొంది. దీంతో తొలి మ‌ర‌ణం న‌మోదైంది. తుఫాన్ కార‌ణంగా వేగంగా వీస్తున్న గాలుల‌కు కోనసీమ జిల్లాలోని మక్కనపల్లి గ్రామంలో తాటిచెట్టు కూలి వీరవాణి (Veeravani)  (49) అనే మహిళ (Woman) దుర్మరణం (Tragic Death) చెందింది. దీంతో మొంథా ప్రభావంతో రాష్ట్రంలో మొదటి మరణం నమోదైంది.

తుఫాను కారణంగా కోనసీమ జిల్లాలో గాలివానలు, భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలమట్టమవుతుండగా, విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మోంథా తుఫాన్ మచిలీపట్నానికి 120 కి.మీ., కాకినాడకు 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment