మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) తల్లి (Mother) శాంతకుమారి (Shanthakumari) (86) కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
శాంతకుమారి మరణ వార్త తెలుసుకున్న వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు మోహన్‌లాల్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. తల్లి మరణంతో మోహన్‌లాల్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తనను వరించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సమయంలో తల్లి సమక్షంలో ఆనందాన్ని పంచుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.








