తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మంచు మనోజ్(Manchu Manoj)తో వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని తన నివాసంలో జరుగుతున్న వివాదాన్ని కవరేజ్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా సంస్థ రిపోర్టర్‌పై మోహన్ బాబు దాడి (Journalist Attack) చేశారు. ఆ దాడికి సంబంధించిన వీడియోలు సైతం అప్పట్లో హల్‌చల్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదవగా, మోహన్ బాబు న్యాయపరమైన చర్యలు చేపట్టారు.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో మోహన్‌బాబు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ నిర్ణయంతో మోహన్ బాబు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఈ కేసుపై తుది తీర్పు వచ్చేంత వరకు అనిశ్చితి కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.