“నేను తప్పు చేశానా?” ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.

"నేను తప్పు చేశానా?" ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.

సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ (Asia Cup)  2025 కోసం టీమిండియా (Team India) జట్టు(Team)లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసియా కప్ వంటి మెగా టోర్నమెంట్‌కు తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక అవుతానని భావించిన ఈ సీనియర్ పేసర్‌కు నిరాశ ఎదురైంది. రాబోయే T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో టీమిండియా తరపున T20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఐపీఎల్‌లో అతను ఆశించినంతగా రాణించకపోవడంతో ఆసియా కప్ రేసులో వెనుకబడ్డాడు. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పటికీ, ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పాలంటూ సెలెక్టర్లను పరోక్షంగా ప్రశ్నించాడు.

ఈ విషయంపై షమీ మాట్లాడుతూ, “ఆసియా కప్‌కు ఎంపిక చేయనందుకు నేను ఎవరినీ నిందించను, ఎవరిపైనా ఫిర్యాదు చేయను. నేను జట్టుకు సరైన వాడినైతే నన్ను ఎంపిక చేయండి. కాకపోతే, నాకు ఎలాంటి సమస్యలు లేవు. టీమిండియాకు ఏది ఉత్తమమో అది చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. నాకు అవకాశం లభిస్తే నా శక్తి మేరకు నేను కృషి చేస్తాను. నా సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. నేను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దులీప్ ట్రోఫీ ఆడగలిగితే T20 క్రికెట్ ఎందుకు ఆడలేను?” అని ప్రశ్నించాడు.

గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో షమీని ఎంపిక చేశారు. ఆ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం T20 ఫార్మాట్‌లో షమీ ఫిట్‌నెస్‌, వయసును పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ అతనిపై నమ్మకం ఉంచలేదని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment