టీమిండియా (Team India) సీనియర్ బౌలర్ (Bowler) మహ్మద్ షమీ (Mohammed Shami)పై అతడి మాజీ భార్య (Former Wife) హసీన్ జహాన్ (Hasin Jahan) సంచలన ఆరోపణలు చేసింది. షమీకి వ్యక్తిత్వం లేదని, తన క్రూరమైన మనస్తత్వంతో తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించింది. వీరి విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల కలకత్తా (Kolkata) హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది.
హసీన్ జహాన్ ఆరోపణలు:
“గత ఏడేళ్లుగా మన మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. నీ క్యారెక్టర్ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వంతో సొంత కుటుంబాన్నే చేజేతులా నాశనం చేశావు. మమ్మల్ని చంపడానికి, మా పరువు తీసి వేధించడానికి, నన్ను ఓడించడానికి నువ్వు ఎంతమంది క్రిమినల్స్ (Criminals)కు డబ్బు(Money) ఇచ్చి ఉంటావు?” అని హసీన్ జహాన్ తన పోస్ట్‌లో ప్రశ్నించింది.
ఆమె కొనసాగిస్తూ, “దానివల్ల నువ్వు ఏమైనా సాధించావా? క్రిమినల్స్, వేశ్యలకు నువ్వు ఇచ్చిన డబ్బును.. మన కుమార్తె చదువు కోసం వెచ్చించి ఉంటే, మన భవిష్యత్తు కోసం ఉపయోగించి ఉంటే ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది. మనమంతా ఎంతో మర్యాదగా జీవించేవాళ్లం” అని ఆవేదన వ్యక్తం చేసింది.
“నాకు ఆ భగవంతుడు ఎంత ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడో చూడు. నిజం కోసం నేను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నాను… ఉంటాను కూడా. అందుకే, నువ్వు ఎంతమంది క్రిమినల్స్‌తో చేతులు కలిపినా నన్ను ఏమీ చేయలేకపోతున్నావు. ఈ పురుషాధిక్య సమాజంలో నాపై నిందలేసి నువ్వు మద్దతు కూడగట్టుకోగలవేమో..! కానీ, ఏదో ఒకరోజు నీకు కూడా కష్టకాలం మొదలవుతుంది. అప్పుడు నీకు అండగా నిలిచినవాళ్లే నిన్ను తరిమేస్తారు. చట్టంపై నాకు నమ్మకం ఉంది” అని షమీని ఆమె దుయ్యబట్టింది.
కేసు వివరాలు:
2014లో మహ్మద్ షమీ, హసీన్ జహాన్‌ల వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. అయితే, ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్ షమీపై గృహహింస కేసు పెట్టింది. దీనిపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హసీన్ మరియు ఆమె కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలను భరణం కింద చెల్లించాలని షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.