ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అరుదైన ఘనతను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ మహ్మద్ షమీ సొంతం చేసుకున్నారు. ఇన్నింగ్స్ ప్రారంభ బంతికే అత్యధికసార్లు వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన నూతన రికార్డు సృష్టించారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే షమీ నాలుగుసార్లు వికెట్ పడగొట్టాడు. గతంలో ఎవరూ చేయని వినూత్న మైలురాయి.
షమీ తొలిసారి 2014లో ఢిల్లీ తరఫున ఆడుతూ జాక్వెస్ కల్లిస్ (KKR)ను అవుట్ చేశాడు. అనంతరం 2022లో గుజరాత్ తరఫున కేఎల్ రాహుల్ (LSG), 2023లో ఫిల్ సాల్ట్ (DC), తాజాగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ను ఔట్ చేశాడు.
గతంలో ఉమేశ్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, అశోక్ దిండాలాంటి బౌలర్లు మూడుసార్లు ఫస్ట్ బంతికే వికెట్ తీయగా, షమీ మాత్రం నాలుగుసార్లు ఈ ఘనతను నమోదు చేసి IPL రికార్డు నెలకొల్పాడు.