భారత్ మరియు అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా విడుదలయ్యింది. రెండు దేశాలు ఫ్రేమ్‌వర్క్‌కు అంగీకరించగా, రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 18 శాతానికి తగ్గించారు. ఈ సుంక తగ్గింపు ప్రధానంగా ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం ద్వారా ఖరారు అయింది. ఈ ఫలితంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతాయని, భారత్‌కు వ్యాపార, పరిశ్రమల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ ఒప్పందంపై ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు, ట్రంప్ వ్యక్తిగత నిబద్ధతకు ధన్యవాదాలు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది గొప్ప ప్రోత్సాహం అవుతుందని, రైతులు, వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులు తదితరులకు కొత్త అవకాశాలు లభిస్తాయని మోడీ అభిప్రాయపడ్డారు. అంతేకాక, మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది పాజిటివ్ ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్