“ఎన్డీఏ త‌మిళ‌నాడు ద్రోహి” – మోదీ పోస్ట్‌కు స్టాలిన్ కౌంటర్‌

“తమిళనాడు ఎన్‌డీఏతోనే” – మోదీ పోస్ట్, స్టాలిన్ కౌంటర్‌

తమిళనాడు (Tamil Nadu) ఎన్‌డీఏ (NDA)తోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మధురాంతకం‌లో జరిగే ఎన్‌డీఏ ర్యాలీలో తాను పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన మోదీ, అవినీతిలో మునిగిపోయిన డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు చెప్పాలని తమిళనాడు నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ పాలన విజయాలు, ప్రాంతీయ ఆశయాల పట్ల నిబద్ధత ప్రజల హృదయాలను తాకుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ వేడిని పెంచాయి.

అయితే ప్రధాని పోస్ట్‌కు తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin) ఘాటుగా స్పందించారు. ఎన్‌డీఏ చేసిన ద్రోహాల లెక్కను తమిళనాడు ప్రజలు గుర్తుపెట్టుకున్నారని వ్యాఖ్యానిస్తూ మరో పోస్ట్ చేశారు. సమగ్ర శిక్ష నిధులు, డీలిమిటేషన్ హామీలు, గవర్నర్ వ్యవహారం, తమిళ భాషకు నిధులు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, మదురై ఎయిమ్స్, ప్రకృతి విపత్తుల సహాయం, హోసూరు విమానాశ్రయం, మెట్రో ప్రాజెక్టులు, కీలడి నివేదిక, నీట్ మినహాయింపు వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిరంతరం ద్రోహాలకే పాల్పడుతున్న బీజేపీ కూటమికి తమిళనాడు ఎప్పుడూ ఓటమినే అందిస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment