మెలోనికి మోడీ ‘మెలోడి’ గిఫ్ట్.. వీడియో వైరల్!

మెలోనికి మోడీ ‘మెలోడి’ గిఫ్ట్.. సోషల్ మీడియాలో వైరల్!

Summarize with AI

ఇటలీ (Italy) పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ (Narendra Modi) మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఇటలీ (Italy) ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) కు ఆయన ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘మెలోడి’(Melodi) పేరుతో ప్రసిద్ధి చెందిన టాఫీల ప్యాకెట్‌ను మెలోనికి అందించిన మోడీ.. ఆ సరదా క్షణాన్ని వీడియోగా చిత్రీకరించిన మెలోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో #Melodi హ్యాష్‌ట్యాగ్ మళ్లీ ట్రెండ్ అవుతోంది. “బహుమతికి ధన్యవాదాలు” అంటూ మెలోని చేసిన పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. “మెలోడి అంటే చాక్లెటే కాదు.. మోడీ-మెలోని ఫ్రెండ్‌షిప్ కూడా” అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

గత కొంతకాలంగా మోడీ-మెలోని (Modi-Meloni) మధ్య ఉన్న స్నేహబంధం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి #Melodi హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈసారి మోడీ ఇచ్చిన ‘మెలోడి టాఫీ’ గిఫ్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీలో ఉన్న మోడీ.. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ అధికారిక సమావేశాల మధ్య చోటుచేసుకున్న ఈ సరదా సంఘటన మాత్రం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment