ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) జన్మదినం (Birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల జల్లు కురుస్తున్న వేళ, సినీ ప్రపంచం నుంచి ఒక ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. పీఎం మోడీ జీవితం (PM Modi Life) ఆధారంగా బయోపిక్ (Biopic)ను తెరపై ఆవిష్కరించనున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ (Poster)ను విడుదల చేస్తూ.. మోడీ బయోపిక్ టైటిల్‌ను రివీల్ చేశారు. ‘మా వందే’ (Our Vande) అనే సినిమా టైటిల్‌కు ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది అనే క్యాప్షన్‌ను జోడించి పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ ప్రాజెక్ట్‌కు దక్షిణాది టాప్ టెక్నీషియన్స్ పనిచేయడం విశేషం. మలయాళ నటుడు ఉన్నీ ముకుందన్ (Unni Mukundan) మోడీ పాత్రలో కనిపించనుండగా, తెలుగు దర్శకుడు సీహెచ్. క్రాంతి కుమార్ (C.H Kranthi Kumar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, రాజమౌళి సినిమాల కోసం పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరా పనులు చేపడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌లో “ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది” అనే లైన్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా మదర్ సెంటిమెంట్‌ను కథలో ప్రధానాంశంగా చూపించబోతున్నారని ఊహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2019లో ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో ఒక బయోపిక్ ఇప్పటికే విడుదల కాగా, ఇది మోడీపై తెరకెక్కుతున్న రెండో బయోపిక్ అవుతుంది.







