అక్కడ కూాడా మొబైల్ వాడుతున్నారా? మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పు!

అక్కడ కూాడా మొబైల్ వాడుతున్నారా? మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పు!

Summarize with AI

ప్రస్తుత జనరేషన్‌లో మొబైల్‌ ఫోన్లు (Mobile Phones) కామన్‌. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్స్‌ విపరీతంగా వాడేస్తున్నారు. ఇక జియో(Jio) వచ్చాక ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి జేబులోనూ మొబైల్‌ కచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా… ఆ మొబైల్‌ ఉండాల్సిందే.. లేకపోతే.. మనసుకు ఎదో మరిచిపోయిన ఫీలింగ్‌ వచ్చేస్తుంది. ఇలా కొందరు ప్రశాంతంగా ఉండే.. బాత్రూం (Bathroom) లోకి కూడా మొబైల్‌ (Mobile) ను తీసుకుపోతున్నారు.

అయితే.. మొబైల్‌ ఫోన్‌తో బాత్రూంకు తీసుకెళ్లే అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి (Illness) గురి చేస్తుంది. మీరు లేక మీ కుటుంబ సభ్యులు టాయిలెట్‌ నుంచి ప్రమాదకర బ్యాక్టీరియాను (Dangerous Bacteria) ఇంట్లోకి తెస్తారు. ఇది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే పైల్స్‌ సమస్య (Piles Problem) ఇప్పుడు యువతో కూడా సాధరణమైంది. పైల్స్‌ సమస్య కారణంగా మీ మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం చేస్తుంటారు. అయితే మీరు మొబైల్‌తో బాత్రూమ్‌లో కూర్చున్నప్పుడు, ఫోన్‌పైన మీ పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఈ కారణంగా మీరు సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల హేమోరాయిడ్స్‌ (Hemorrhoids) అంటే పైల్స్‌ వచ్చే ప్రమాదం పెంచుతుంది. కాబట్టి ఇకనైనా మొబైల్‌ ఫోన్‌ను టాయిలెట్‌లోకి తీసుకువెళ్లకండి.

Join WhatsApp

Join Now

Leave a Comment