కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి

కుటుంబం లో ఐదుగురు అనుమానస్పద మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటన మక్తమహబూబ్‌పేటలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ మరణాలను ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.

మృతులు కర్ణాటకకు చెందిన అనిల్, అతని భార్య కవిత, వారి రెండేళ్ల చిన్నారి, కవిత తల్లిదండ్రులు అని గుర్తించారు. ఈ ఐదుగురు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషయం గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment