హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు గ్లోబల్ అందాల పోటీ (Global Beauty Contest)కి వేదికగా మారబోతోంది. శనివారం సాయంత్రం నుండి గచ్చిబౌలి స్టేడియంలో (Gachibowli Stadium) ప్రతిష్ఠాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు (Prestigious Miss World Competitions) గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 110కు పైగా దేశాల నుండి వచ్చిన ముద్దు గుమ్మలు ఈ పోటీల్లో తమ అందం, టాలెంట్‌తో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా, మిస్ మాంటి నీగ్రో ఆండ్రియో నికోలిక్, మిస్ అల్బేనియా ఎలోనా డ్రెకాజ్ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ సాయంత్రం 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. కాగా, ప్రస్తుతం భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ఊపందుకుంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిరోజూ సాయంత్రం కాల్పుల మోత. శత్రుదేశం దాడికి చేయడానికి ఆస్కారం ఉన్న నగరంగా కేంద్రం హైదరాబాద్‌ను కేటగిరీ 2లో ఎంపిక చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అందగత్తెల పోటీలు అవసరమా..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రపంచ నలుమూలల నుంచి ఏకంగా 110కి పైగా దేశాల నుంచి అందాల తారలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇప్పుడు వారి భద్రతకు ఎలాంటి లోటు తలెత్తకుండా చూసుకోవాలని, అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో పోటీలు అవసరమా..? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు నగర పౌరులు. దురదృష్టవశాత్తు ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఇన్నాళ్లు కాపాడుకున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమైపోతుందని నగర వాసులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ప్రభుత్వం (Government) మాత్రం ఎలాంటి ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి అందాల పోటీలను నిర్వహిస్తోంది.