ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భయంతో బయటకు..
ముండ్లమూరులోని ప్రభుత్వ స్కూల్ నుండి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా భూప్రకంపనల కారణంగా భయంతో ఆఫీసుల నుంచి బయటకు వెళ్లారు.
ప్రభుత్వం సూచనలు
స్వల్ప భూప్రకంపనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏదైనా పెనుప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు.