డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మంత్రి సోద‌రుడి దాడి.. వీడియో వైర‌ల్‌

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మంత్రి సోద‌రుడి దాడి.. వీడియో వైర‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పోలీసులపై (Police) జరుగుతున్న దాడుల పరంపరలో మరో షాకింగ్ ఘటన సంచలనం రేపుతోంది. కర్నూలు జిల్లా (Kurnool District)లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ (AR Constable) జస్వంత్‌ (Jaswanth)పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) సోదరుడు (Younger Brother) మదన్ భూపాల్ రెడ్డి (Madan Bhoopal Reddy) చేయి చేసుకున్న ఘటన తీవ్ర వివాదంగా మారింది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ (Police Constable) ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ.. బూతులు తిడుతూ చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది?. పోలీసు అధికారులను రక్షించలేని ప్రభుత్వం ప్రజలకు ఏమి భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది?” అంటూ నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మంత్రి కుటుంబ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బనగానపల్లె (Banaganapalle)లో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రై మంత్రి సోద‌రుడిని ఏఆర్ కానిస్టేబుల్ జ‌స్వంత్ అడ్డుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన మంత్రి సోద‌రుడు భూపాల్‌రెడ్డి అత‌నిని దుర్భాష‌లాడుతూ చెయ్యి చేసుకున్నాడు. కానిస్టేబుల్‌పై దాడి వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ సంఘాలు ఈ ఘ‌ట‌న‌ను ఖండించాల‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల దౌర్జన్యాన్ని సమర్థించకూడ‌ద‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment