మెస్సీ మేనియా.. ఉప్పల్ గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్, రాహుల్ ఎంట్రీ

హైద‌రాబాద్‌లో మెస్సీ మేనియా.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్, రాహుల్ ఎంట్రీ

ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లో అభిమానులకు కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) నిర్వహించే ప్రత్యేక ఫ్రెండ్లీ మ్యాచ్‌ హైలైట్‌గా నిలవనుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అభిమానుల ఉత్సాహం నడుమ రాత్రి 7:50 గంటలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ ఈవెంట్‌లో రాజకీయ ప్రముఖుల సందడి కూడా కనిపించనుంది. రాత్రి 8:06 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మైదానంలోకి అడుగుపెడతారు. అదే సమయంలో లియోనెల్ మెస్సీ కూడా పిచ్‌పైకి ఎంట్రీ ఇవ్వనుండగా, ఆయనతో పాటు అర్జెంటీనా స్టార్ ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ అభిమానులను అలరించనున్నారు. అనంతరం 8:10 గంటలకు హార్డ్ స్టాప్‌, 8:13 గంటలకు పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించనున్నారు.

రాత్రి 8:18 గంటలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మైదానంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:38 గంటలకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో పాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి పరేడ్ వాక్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్టేడియం మొత్తం అభిమానుల నినాదాలతో మార్మోగనుంది.

ఆ తర్వాత పలు వినోదాత్మక మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 8:51 గంటలకు ఈవెంట్ ఆర్గనైజర్లు, జట్ల సభ్యులతో కలిసి మెస్సీ ఫొటోషూట్‌లో పాల్గొంటారు. అనంతరం మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా ‘గోట్ కప్’ (GOAT Cup) ప్రదానం చేయనున్నారు. చివరగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి ఘన సన్మానం చేయనుండగా, రాత్రి 9 గంటలతో ఈ మెగా ఈవెంట్ ఘనంగా ముగియనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment