మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడటం ద్వారా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తాజాగా మేకప్ ఆర్టిస్ట్ (Makeup Artist) శివనాథ్ (Shivanath) (శివ) గుండె శస్త్రచికిత్స కోసం రూ.10.5 లక్షల ఆర్థిక సహాయం అందించి, అపోలో ఆసుపత్రికి (Apollo Hospital) స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చికిత్స పూర్తిగా జరిగేలా చూసుకున్నారు. అలాగే తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య (K.V. Narasaiah) కుటుంబానికి(Family)కూడా రూ.9.5 లక్షల సహాయం చేసి, బైపాస్ శస్త్రచికిత్సకు (Bypass Surgery) అవసరమైన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
ఇదే కాకుండా, సినీ రంగానికి సంబంధించిన పలు సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి ముందుంటున్నారు. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో (Gaddar Awards) పొందిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (NTR National Award) నుంచి వచ్చిన రూ.10 లక్షలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించి, మరో రూ.5 లక్షలను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు అందించారు. విపత్తుల సమయంలోనూ, వ్యక్తిగత అవసరాల్లోనూ నిరంతరం సహాయం చేస్తూ “రియల్ హీరో”గా నిలుస్తున్న చిరంజీవి సేవలు మరెందరికో స్ఫూర్తిగా మారుతున్నాయి.








