మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి.. – ఢిల్లీలో ఎంపీల పోరాటం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి.. - ఢిల్లీలో ఎంపీల పోరాటం

వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Government Medical Colleges) చంద్ర‌బాబు స‌ర్కార్‌ (Chandrababu Government) ప్రైవేట్ సంస్థలకు (Private Institutions) అప్పగించే చర్యలపై వైసీపీ(YSRCP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ (One Crore Signature Campaign) పేరుతో ప్రజాభిప్రాయం (Public Opinion) స్పష్టంగా బయటపడుతుండగా, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీల (YSRCP MPs) బృందం బుధవారం న్యూఢిల్లీ (New Delhi)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)ను కలిసి తమ ఆందోళనను తెలియజేసింది. ప్రైవేటీకరణను (Privatization) తక్షణమే నిలిపివేయాలి అని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ భేటీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బా రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, అయోధ్య రామి రెడ్డి, గొల్ల బాబురావు, లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజారాణి పాల్గొన్నారు. ప్రైవేటీకరణ జరిగితే పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య అవకాశాల నుంచి దూరమవుతారని ఎంపీలు మంత్రికి వివరించారు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 17 మెడికల్ కాలేజీలను స్థాపించిందని, అందులో 7 ఇప్పటికే పూర్తయ్యి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని ఎంపీలు గుర్తుచేశారు. ఈ మెడికల్ కాలేజీల భూములను ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు లీజ్ ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్మించిన సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి ఇస్తే, ప్రభుత్వ ఆరోగ్య సేవలు దెబ్బతిని, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత దూరమవుతుందని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వైద్యుల కొరత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యం బలహీనమవుతుందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక కోటి కంటే ఎక్కువ సంతకాలు సేకరించబడినట్లు వివరించిన వారు, ఈ సంతకాలను ఈ నెల 17న రాష్ట్ర గవర్నర్‌ (State Governor)కు సమర్పించనున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు.

రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగానికి ఇవ్వకూడదనే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, వైద్య విద్య భవిష్యత్తు దెబ్బతినే నిర్ణయాలను ఆపడం అత్యవసరమని వారు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment