కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి ల‌భ్యం

కృష్ణా జిల్లాలో మూడు బ‌స్తాల‌ గంజాయి ల‌భ్యం

Summarize with AI

కృష్ణా జిల్లా (Krishna district) ఉంగుటూరు (Unguturu) మండలంలో భారీగా గంజాయి ల‌భ్య‌మైంది. ఆత్కూరు (Atkur) పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 60 కేజీల గంజాయితో పాటు ఎర్టిగా మారుతి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై ఎస్పీ ఆర్. గంగాధర్ (R. Gangadhar) మీడియా సమావేశం నిర్వ‌హించి వివ‌రాలు వెల్లడించారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పొట్టిపాడు టోల్ గేట్ (Pottipadu Toll Gate) వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్సై సురేష్ (SI Suresh) నేతృత్వంలో సిబ్బంది అడ్డుకున్నార‌ని, తహసీల్దార్ (Tahsildar) సమక్షంలో వాహన తనిఖీ నిర్వహించగా, కారులో మూడు బస్తాల్లో భారీగా గంజాయి (Ganja) నిల్వ ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.

అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు (Paderu) ప్రాంతానికి చెందిన వారు అని పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రానికి గంజాయిని తరలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment