హిడ్మాది ఎన్‌కౌంట‌ర్ కాదు.. మావోయిస్టు పార్టీ సంచ‌ల‌న లేఖ

హిడ్మాది ఎన్‌కౌంట‌ర్ కాదు.. మావోయిస్టు పార్టీ సంచ‌ల‌న లేఖ

మావోయిస్ట్‌ (Maoist) కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా (Madivi Hidma), శంకర్ (Shankar) హత్యలపై న్యాయ విచారణ జరిపించాలని ఆ పార్టీ కేంద్ర క‌మిటీ బ‌హిరంగ లేఖ (Open Letter) విడుద‌ల చేసింది. మావోయిస్టు పార్టీ దండకారణ్య (Dandakaranya) స్పెషల్ జోనల్ కమిటీ బహిరంగ లేఖ విడుదల చేసింది. కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరుతో వచ్చిన ఈ లేఖలో కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. హిడ్మా హత్యపై మనీష్ కుంజం, సోని చేసిన ఆరోపణలను పార్టీ తీవ్రంగా ఖండించింది.

“కస్టడీలో హత్య” ఆరోపణలు
ఈ లేఖలో హిడ్మా (Hidma)సహా మరో ఐదుగురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh Police) నవంబర్ 15న పట్టుకుని, మూడు రోజుల పాటు క్రూర హింసకు గురి చేసి హత్య చేసినట్లు ఆరోపించారు. అనంతరం ఈ మరణాలను మారేడ్‌మిల్లి (Maredumilli) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌గా చూపించేందుకు తప్పుడు కథ అల్లారని మావోయిస్టులు ఆరోపించారు. హిడ్మా అక్టోబర్ 27న విజయవాడలో చికిత్స కోసం స్థానిక కలప వ్యాపారితో కలిసి వెళ్లినట్లు కూడా లేఖ పేర్కొంది.

మరిన్ని హత్యలు, కుట్ర ఆరోపణలు
నవంబర్ 19న మరో ఏడుగురిని కూడా ఇదే విధంగా హత్య చేశారని మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది. విజయవాడలో చికిత్స కోసం వెళ్ళిన మరికొంత మంది కామ్రేడ్స్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారని, వారిని నిరాయుధులై ఉన్నప్పటికీ హతమార్చారని ఆరోపించింది. ఈ అన్ని చర్యల వెనుక ఇంటలిజెన్స్ ఏజెన్సీల సమన్వయం ఉందని మావోయిస్టులు పేర్కొన్నారు.

50 మందిని జైలుకు పంపినట్లు ఆరోపణ
ఈ ఘటనల నేపథ్యంలో మొత్తం 50 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మావోయిస్టులు ఆరోపించారు. వరుస ఎన్‌కౌంటర్ కథల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టేందుకు ప్రజాసంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు. హిడ్మా మరణం, తదనంతర సంఘటనలు ప్రాంతంలో మరోసారి చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment