భారత కెప్టెన్ (India’s Captain) శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రదర్శించిన దూకుడుపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గిల్ (Gill) విరాట్ కోహ్లీ (Virat Kohli)ని అనుకరిస్తున్నాడని, తన ఆవేశాన్ని నియంత్రించుకోవాలని, ఆటపై దృష్టి పెట్టాలని తివారీ సలహా ఇచ్చారు.
ఇంగ్లాండ్ (England)తో లార్డ్స్ (Lords)లో జరిగిన మూడో టెస్ట్ (Third Test) మ్యాచ్‌లో గిల్ ప్రవర్తనపై మనోజ్ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ మూడో రోజు ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీతో గిల్ మాటల యుద్ధానికి దిగాడు. దీనిపై తివారీ మాట్లాడుతూ, “గిల్ విరాట్ కోహ్లీలా అవ్వాలని కోరుకుంటున్నాడని, దాని కోసం అతని పద్ధతులను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది” అని అన్నారు.
ఐపీఎల్(IPL)లో కెప్టెన్ అయినప్పటి నుండి గిల్ దూకుడుగా మారడం గమనించానని, అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగుతున్నాడని తివారీ పేర్కొన్నారు. ఇవన్నీ గిల్ నిజ స్వభావానికి దూరంగా ఉన్నాయని, గతంలో అతను ఇలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
“ఒక కెప్టెన్ దూకుడుగా ఉండటం మంచిదే, కానీ అది మాటల్లో కాకుండా ఆటలో కనిపించాలి. టెస్ట్ మ్యాచ్‌లను గెలవడం ద్వారా కూడా దూకుడును చూపించవచ్చు” అని తివారీ సలహా ఇచ్చారు. లార్డ్స్ టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు కాబట్టి, మైదానంలో ఎక్కువగా దూకుడుగా కనిపించడం అతనికి మంచిది కాదని మనోజ్ తివారీ హితవు పలికారు.