మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించ‌డం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది.

తప్పిన ప్ర‌మాదం..
డిసెంబర్ 17న, తెల్లవారుజామున కొయిరెంగేయ్ ప్రాంతంలో సీఎం నివాసం సమీపంలో ఈ బాంబును స్థానికులు గుర్తించారు. ఈ సంఘటనతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబును నిర్వీర్యం చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

వేగవంతమైన విచారణ
బాంబు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు దాన్ని ప్రయోగించారు అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మ‌ణిపూర్‌లో గ‌త కొద్ది నెల‌లుగా రెండు జాతుల మ‌ధ్య విప‌రీత‌మైన వివాదాలు, దాడులు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment