మంధాన vs జెమిమా… WPL కప్ ఫైట్

మంధాన vs జెమిమా… WPL కప్ కోసం

Summarize with AI

గురువారం జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగే ఈ కీలక పోరు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. స్మృతి మంధాన నాయకత్వంలోని RCB రెండోసారి టైటిల్ గెలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది.

ఇప్పటివరకు మూడు ఫైనల్స్‌లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా సన్నిహిత మిత్రులు అయిన స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్లుగా ఒకరినొకరు ఎదుర్కోవడం ఈ ఫైనల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ సీజన్‌లో వరుసగా ఐదు విజయాలతో RCB అదరగొట్టగా, గ్రేస్ హారిస్, గౌతమి నాయక్ కీలక ఇన్నింగ్స్‌లు జట్టును ఫైనల్ దాకా తీసుకొచ్చాయి. నాడిన్ డి క్లెర్క్, శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌లో మ్యాచ్ విన్నర్లు గా నిలిచారు. మరోవైపు కొత్త కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ సమతూకంతో కూడిన ప్రదర్శన కనబరిచింది.

నందిని శర్మ బౌలింగ్‌లో సంచలనం సృష్టించగా, షెఫాలీ వర్మ, లిజెల్ లీ, లారా వోల్వార్డ్ బ్యాటింగ్‌లో జట్టుకు బలం చేకూర్చారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… మంధాన నేతృత్వంలోని RCB చరిత్ర సృష్టిస్తుందా? లేక జెమిమా సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ శాపాన్ని తొలగిస్తుందా? WPL అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment