ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ప్రత్యేక పర్యటన చేశారు. దివంగత ఎమ్మెల్యే మౌనిక రెడ్డి త‌ల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్‌లో మంచు మ‌నోజ్ దంప‌తులిద్ద‌రూ నివాళులర్పించారు. వీరి రాకతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.

ఇక మంచు మనోజ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగుతుండటంతో, ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మంచు మ‌నోజ్ దంప‌తులు ఎలాంటి కీలక ప్రకటన చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

మంచు మనోజ్ దంప‌తులు రాజ‌కీయాల్లో అడుగుపెడుతున్నార‌ని, సినీ సెల‌బ్రెటీ స్థాపించిన జ‌న‌సేన పార్టీలోనే వీరు చేర‌బోతున్నార‌నే వార్త ఒక‌టి తెగ వైర‌ల్ అవుతుంది. భూమా కుటుంబం ఆళ్లగడ్డలో తమ పర్యటన నంద్యాల జిల్లా రాజ‌కీయం వేడెక్కింది.

Join WhatsApp

Join Now

Leave a Comment