మద్యం (Alcohol) మత్తులో ఓ వ్యక్తి మూగజీవిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని మాల్దా జిల్లాలో ఓ వ్యక్తి ఫుల్ట్‌గా మద్యం సేవించి మందలో మేస్తున్న మేక (Goat) ను అపహరించి ఆ మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ (Police Station) లో మేకల యజామాని ఫిర్యాదు చేశాడు.
మల్దా జిల్లా (Malda District) లోని వ్యక్తి పీకలదాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి తన మందలోని మేకను అపహరించి దూరంగా తీసుకెళ్లి దానిపై అఘాయిత్యానికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అడ్డుకునేందుకు వెళ్లగా, తనపై కూడా ఆ తాగుబోతు దాడికి పాల్పడ్డాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మందుబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘోర ఘటన (Incident) స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.