టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తో కలిసి నటించడం ఎంతో గర్వంగా అనిపించిందని ‘మంజుమల్ బాయ్స్ (Manjummel Boys)’ ఫేమ్ సౌబిన్ షాహిర్ (Soubin Shahir) తెలిపారు. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ‘కూలీ (Coolie)’ చిత్రంలో కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన తన అభిమానులతో పంచుకున్నారు.
“సెట్స్‌లో నాగ్‌తో గడిపిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమైనది. నాగార్జునని చూస్తే, స్టైల్ (style), స్వాగ్ (swag) అనే కన్సెప్టును ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేను. నేనెప్పటికీ ఆయన అభిమానినే!” అంటూ షాహిర్ ఒక సెల్ఫీ ఫోటోను షేర్ చేశారు. సౌబిన్ షాహిర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.