ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Video)

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్ర స‌చివాల‌యం (Secretariat) లో భారీ అగ్ని ప్ర‌మాదం (Major Fire Accident) సంభ‌వించింది. స‌చివాల‌యంలోని రెండవ బ్లాక్‌లో శుక్ర‌వారం ఉద‌యం అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో సిబ్బంది ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు లోన‌య్యారు. రెండో బ్లాక్‌ (Second Block) లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంట‌లు చెల‌రేగ‌డంతో, విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్ర‌మాదానికి కార‌ణం ఏంటి..? ఈ ప్ర‌మాదంలో కీల‌క‌మైన ఫైల్స్ ఏమైనా ద‌గ్ధ‌మ‌య్యాయా..? ఎప్పుడు, ఏ విధంగా మంట‌లు అంటుకున్నాయ‌నే విష‌యాల గురించి తెలియాల్సి ఉంది.

సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), టూరిజం మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh), దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణరెడ్డి (Anam Narayana Ramanarayana Reddy), మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Narayana), హోం మంత్రి వంగలపూడి అనిత (Anitha) ల పేషీలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment