మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ సెట్.. ఎక్క‌డంటే..

మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ సెట్.. ఎక్క‌డంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్టు రైటింగ్‌లో రాజ‌మౌళి, అందుకు సంబంధించిన ప‌నుల్లో మ‌హేష్ బిజీగా ఉన్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ త‌రువాత ప్రారంభం అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మహేష్ ఇంట్రో కోసం ప్రత్యేక సెట్?
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఇంట్రడక్షన్ కోసం రాజమౌళి ప్రత్యేకంగా ఓ లొకేషన్ డిజైన్ చేసి, భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. ఈ రూమర్ వల్ల అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. రాజమౌళి అందించే విజువల్ ఎఫెక్ట్స్ మరియు మహేష్ బాబు ఎనర్జీ కలయికతో ఈ సినిమా ప్రేక్షకులకు నయా అనుభూతిని అందించే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment