సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘SSMB29’పై తాజా క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఒడిశాలోని అడవుల్లో కీలక షెడ్యూల్ పూర్తైన ఈ చిత్రం తదుపరి దశకు సిద్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, జులైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈసారి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ ఈ సినిమా షూటింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారనుంది. అక్కడే సినిమా కోసం కీలక యాక్షన్ మరియు అడ్వెంచర్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు టాక్.
అయితే, ఈ సమాచారం గురించి ఇప్పటివరకు ఆధికారికంగా మేకర్స్ నుంచి ప్రకటన వెలువడలేదు. అయినా కూడా ఈ ఇంటర్నేషనల్ షెడ్యూల్ గురించి వినిపిస్తున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా విభిన్నమైన విజన్, అత్యాధునిక టెక్నాలజీ, భారీ లొకేషన్లు ఉండడం ఖాయం. మహేశ్ బాబు ఈ సినిమాలో గ్లోబల్ లెవెల్ అడ్వెంచర్‌లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.








