నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. లేటెస్ట్‌ సినిమాపై మహేశ్‌ ప్రశంసలు

నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. లేటెస్ట్‌ సినిమాపై మహేశ్‌ ప్రశంసలు

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ (Sab Ka Apna Apna Normal) అనేది ఈ సినిమా ఉపశీర్షిక. అమీర్ ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (Taare Zameen Par) (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

తాజాగా, ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్ అందరి మనసులను దోచుకుంటుందని మహేష్ బాబు పేర్కొన్నారు. “ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు” అని ఆయన తన రివ్యూలో రాసుకొచ్చారు.

సితారే జమీన్ పర్ మూవీలో అమీర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment