మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ భయానక ఘటనలో ఐదుగురు (Five People) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News Wire
-
01
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.
-
02
అంబటి రాంబాబుకు బెయిల్
గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ కేసు నమోదు. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు.
-
03
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
04
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
05
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.
-
06
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
-
07
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
-
08
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
09
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
10
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు








