---Advertisement---

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక
---Advertisement---

అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. కుంభ‌మేళాకు దేశ నలుమూలల నుంచే గాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. మహా కుంభమేలాలో విదేశీ సందర్శకులు సందడి కనిపించింది. ప్ర‌యాగ్‌రాజ్‌లో నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళా పుణ్యస్నానాలు, ఆధ్యాత్మికతకు భక్తులను ఆహ్వానిస్తోంది. ఈ శుభకార్యంలో ప్రపంచం నలుమూలల నుంచి 35 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

భారీ ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహా కుంభమేళా కోసం రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన ఈ మేళాలో పారిశుధ్యం, భద్రత, డిజిటల్ సదుపాయాలు క‌ల్పించారు. భక్తుల కోసం 12 కిలోమీటర్ల ఘాట్లు, 1,850 హెక్టార్ల పార్కింగ్ స‌దుపాయం ఏర్పాటు చేశారు. గత కుంభమేళాతో పోలిస్తే ఈసారి కుంభమేళాకు 25% అదనంగా స్థలం కేటాయించి మరింత సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు. 2019లో కేటాయించిన రూ.3,500 కోట్ల బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఖర్చు రెట్టింపైంది.

కుంభమేళాను వీక్షించేందుకు గూగుల్‌ ప్రత్యేక మ్యాప్‌ను సిద్దం చేసింది. బ్రిడ్జి, ఆశ్రమం, ఎరీనా రోడ్డు మొదలుకుని జాతరనంతా ఈ యాప్‌లో చూడొచ్చు. ఇది గూగుల్‌ పేస్టోర్, యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉంది. దేవాలయాల లోకేషన్‌తో పాటు నగరంలోని ప్రధాన ప్రదేశాలకు సంబంధించిన సమాచారమంతా నిక్షిప్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment